చంద్రబాబు పై సీఐడీ కేసు క్లోజ్ : ఫైబర్ నెట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్దారించిన సీఐడీ

الخميس، 27 نوفمبر 2025

Andhra Pradesh CID case against Chandrababu closed CID confirms that no irregularities were committed in Fiber Net

t f B! P L


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నమోదైన కేసు క్లోజ్ అయింది. ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయి అంటూ జగన్ హయాంలో చంద్రబాబు పైన సీఐడీ కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని సీఐడీ నిర్దారించింది. దీంతో చంద్రబాబుతో సహా సహా మరో 15 మందికి ఊరట లభించింది. అప్పట్లో ఈ వ్యవహారం పై ఫిర్యాదు చేసిన నాటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేకపోవటంతో కేసు క్లోజ్ చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో,కేసు మూసివేతకు కోర్టులో అంగీకారం జరిగింది. వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. 2014-19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో టెర్రాసాఫ్ట్‌ సంస్థకు ఆయాచితంగా రూ.321 కోట్ల లబ్ధిని చేకూర్చారంటూ సీఐడీకి 2021 సెప్టెంబరు 11న నాటి ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసు పెట్టిన రెండేళ్ల తర్వాత... 2023 అక్టోబరు 11న చంద్రబాబు పేరునూ చేర్చారు. అయితే.. భారత్‌ నెట్‌ పథకం కింద కేంద్రం నుంచి విడుదలైన రూ.3840 కోట్లలో రూ.321 కోట్లు టెర్రాసాఫ్ట్ కు బదలాయించినట్లుగా సీఐడీ నిర్ధారించలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఫైబర్‌నెట్‌ కేసులో అక్రమాలు జరగలేదని, ఆర్థిక అక్రమాలు లేవంటూ సీఐడీ ధ్రువీకరించింది. దీనికి సంబంధించి తాజాగా నివేదిక సమర్పించింది. ఫైబర్‌నెట్‌లో అక్రమాలేవీ చోటు చేసుకోలేద ని, సంస్థకు ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని సీఐడీ నివేదికలో తేల్చింది. ఈ నివేదికతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని అప్పట్లో ఫిర్యాదు చేసిన ఫైబర్‌నెట్‌ పూర్వ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మధు సూదన రెడ్డి, ప్రస్తుత మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతాంజలి శర్మ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. వీరు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఇప్పుడు కేసును క్లోజ్‌ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పారు. అక్రమాలు జరగలేదన్న సీఐడీ నివేదికతో పూర్తిగా ఏకీభవించారు. కేసును మూసేస్తున్నట్లు రాత పూర్వకంగా తెలియచేయటంతో పాటుగా మౌఖికంగానూ స్పష్టం చేసారు. దీంతో.. ఈ కేసు నాడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే నమోదు చేసినట్లు స్పష్టం అవుతోందని కూటమి నేతలు చెబుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ