తెలంగాణ డీజీపీ ఆఫీస్‌ ముట్టడించిన అయ్యప్పలు

الخميس، 27 نوفمبر 2025

expressing his anger over the imposition of restrictions on policemen wearing Ayyappa malas to wear uniforms Telangana DGP office besieged by Ayyappa Swamulu

t f B! P L


తెలంగాణలో అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు కూడా యూనిఫాం ధరించాలంటూ ఆంక్షలు విధించడంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు.  హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ రూల్స్ ఉన్నాయంటూ వారు మండిపడ్డారు. అయ్యప్ప స్వాములకు మద్దతుగా బీజేవైఎం కార్యకర్తలు కూడా డీజీపీ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. అయ్యప్ప మాలతో ఆఫీసుకు రాకూడదంటూ ఇచ్చిన మెమోపై దీక్ష తీసుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయానికి వచ్చిన స్వాములు ఆఫీసులోనికి వెళ్లే ప్రయత్నంలో తోపులాట జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీ చార్జీ చేశారని అయ్యప్ప స్వాములు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాములు భారీ ర్యాలీతో డీజీపీ కార్యాలయం ముట్టడికి తరలిరావడంతో వారిని పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవలసి వచ్చింది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా స్వాములు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో స్వాములకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో పోలీసులు కొందరు అయ్యప్పలను అరెస్టు చేశారు. అయ్యప్ప దీక్ష ధరించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని అయ్యప్ప స్వాములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకున్న పోలీసులు యూనిఫామ్ డ్రెస్ కోడ్ లేకుండా డ్యూటీకి రావద్దంటూ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. దీనికి నిరసనగా అయ్యప్పలు ఆందోళనకు దిగారు. అయ్యప్ప దీక్షాధారులకు పోలీస్ డ్రెస్ కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ