విజయవాడలో డయేరియాతో వారం రోజుల వ్యవధిలోనే తొమ్మిది మంది చనిపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వ యాంత్రాంగం వెంటనే ఈ డయేరియా సమస్యపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడలో కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరుసగా జనాలు చనిపోతున్నా పట్టించుకోరా అని నిలదీశారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయారని అధికారులు చెప్పడం ఏమాత్రం సరికాదని అన్నారు. కలుషిత నీటి వల్ల అనారోగ్యానికి గురవుతున్నామనీ.. స్వయంగా ప్రజల నుంచే ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. అయినా కూడా అధికారులు స్పందించకపోవడం దారుణం అన్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పారు. డయేరియాతో చనిపోయిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
డయేరియాతో 9 మంది చనిపోవడం బాధాకరం !
السبت، 1 يونيو 2024
Andhra Pradesh VIJAYAWADA టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డయేరియాతో 9 మంది చనిపోవడం బాధాకరం మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలియజేశారు
ليست هناك تعليقات:
إرسال تعليق