తెలంగాణలోని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారి పై ఓ లారీ డ్రైవర్ లారీ తో మద్యం మత్తులో పూసల రోడ్డు నుంచి బస్టాండ్ వరకు బైక్ లను ఢీకొంటూ వెళ్లాడు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ మీద నుండి షాపులోకి లారీ దూసుకెళ్లింది. ప్రమాదంలో గాయపడిన పలువురని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బైకులు ఢీకొంటూ బస్టాండ్ దగ్గరలో ఉన్న వేప చెట్టుకు ఢీకొని లారీ ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ను కిందికి దించి చితకబాది పోలీసులకు అప్పజెప్పారు.
మద్యం మత్తులో బైక్ లను ఢీకొట్టిన లారీ డ్రైవర్ !
السبت، 1 يونيو 2024
Criem telangana డ్రైవర్ ను కిందికి దించి చితకబాదిన స్థానికులు బస్టాండ్ దగ్గరలో ఉన్న వేప చెట్టుకు ఢీకొని లారీ ఆగిపోవడంతో మద్యం మత్తులో బైక్ లను ఢీకొట్టిన లారీ డ్రైవర్
ليست هناك تعليقات:
إرسال تعليق