ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతున్నవారిని ఢీకొట్టిన లారీ : ఇద్దరు మృతి :
الاثنين، 5 أكتوبر 2026
crime hyderabad Lorry Hits Pedestrians on Tank Bund telangana Two dead young girl celebrating her birthday that very day
ట్యాంక్‌బండ్‌పై ఆదివారం రాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్నవారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. వారిలో ఈరోజే పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి ఉండటం మరింత విషాదాన్ని మిగిల్చింది. మృతులను అల్వాల్‌కు చెందిన చిన్నారి సరాక్షి (6), ఆమె బంధువు విశ్వంత్ (41)గా గుర్తించారు. చిన్నారి సరాక్షి పుట్టిరోజు కావడంతో వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యులు నగరానికి వచ్చారు. కూకట్‌పల్లి పీవీఆర్‌లో సినిమా చూసిన కుటుంబం తర్వాత కేక్ కటింగ్ కోసం ట్యాంక్ బండ్ వద్దకు వచ్చింది. మగ్ధం మోయుద్దీన్ విగ్రహం వద్ద కారు పార్క్ చేసిన కుటుంబ సభ్యులు రోడ్డు దాటుతూ హుసేన్ సాగర్‌వైపు వచ్చారు. ఈ సమయంలోనే సికింద్రాబాద్ నుంచి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో చిన్నారి సరాక్షి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడ్డ విశ్వంత్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. చిన్నారి జన్మదినాన్ని మధుర జ్ఞాపకంగా జరుపుకోవాలని బయటకు వచ్చిన ఆ కుటుంబం రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
ليست هناك تعليقات:
إرسال تعليق