సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ : హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ
الاثنين، 28 سبتمبر 2026
Congress Party Demands CEC Gyanesh Kumar's Resignation Massive Protest Rally in Hyderabad protesters vehemently criticized the BJP government telangana
ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్‌కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డు లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో నిరసన ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పలువురు ప్రముఖ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని స్వతంత్ర రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నీరుగారుస్తోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్‌ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం కీలుబొమ్మలా మార్చుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భారీ కుట్ర జరుగుతోందని, ప్రజల ఓటు హక్కును కాలరాసేలా 'ఓట్ల చోరీ'కి కేంద్ర ప్రభుత్వ పెద్దలే సూత్రధారులని దుయ్యబట్టారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తూ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని, ఆయన పదవిలో కొనసాగే అర్హత కోల్పోయారని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق