ホーム
/
profit from amla
/
ఉసిరికాయ ఒక 'సూపర్‌ఫుడ్' : మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ
الاثنين، 28 سبتمبر 2026
Amla is a 'superfood' food national PM Narendra Modi in Mann Ki Baat Pratapgarh district of Uttar Pradesh state producer who is getting employment profit from amla
భారతీయులు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన ఓ ఆయుర్వేద ఫలం గురించి సెప్టెంబర్ 27 ఆదివారం తాజా మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్‌గడ్ జిల్లాను ఉసిరి సాగుతో ఉపాధి, లాభాలు పొందుతున్న ఓ ఉత్పత్తిదారుల గురించి వివరంగా తెలిపారు. భారతీయ సంప్రదాయ ఫలం ఉసిరి అంటూ చెప్పిన మోడీ ఉసిరికాయను ఒక 'సూపర్‌ఫుడ్'గా అభివర్ణించారు. ఉసిరి రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందిస్తుందని మోడీ కొనియాడారు. ఆయుర్వేదం భారతీయ మూలాల్లో దాగివున్న దివ్యఔషద నిలయంగా చూస్తారు. అందుకే చాలా వరకు ఇప్పటి కూడా ఆయుర్వేద మూలికలు, ఫలాలను తినడానికి చాలా మంది మొగ్గు చూపుతారు. వీటిలో కేవలం ఆరోగ్య ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరీ ముఖ్యంగా ఉసిరికాయ గురించి మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. ఈ స్థానిక ఫలాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌష్టికాహార భద్రతను కూడా బలోపేతం చేయవచ్చని ప్రధాని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాను ప్రధాని మోదీ ఉదాహరణగా చూపించారు. ఈ ప్రాంతానికి ఉసిరితో శతాబ్దాల అనుబంధం ఉందని ప్రస్తుతం 'ఒక జిల్లా - ఒక ఉత్పత్తి' పథకం కింద ఇక్కడి ఉసిరి పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.
ليست هناك تعليقات:
إرسال تعليق