ホーム
/
technology
/
రూ.10, 20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు ప్రభుత్వం ఆమోదం
الاثنين، 5 أكتوبر 2026
business Government Approves Field Trials for Rs 10 and Rs 20 Plastic Notes national RBI has announced technology
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10, రూ. 20 విలువైన ప్లాస్టిక్ నోట్ ఫీల్డ్ ట్రయల్స్ ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఈ నోట్ల తయారీకి కావాల్సిన మెటీరియల్ సరఫరా కోసం కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది. ప్రస్తుతం చలామనిలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ఈ ప్లాస్టిక్ నోట్ల మన్నిక ఎక్కువ కాలం ఉంటుందని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ నోట్లే వినియోగంలో ఉన్నాయని భారత్‌లో కూడా వీటిని అందుబాలోకి తీసుకురావలనే ఉద్దేశంతో ఆర్బీఐ ఈ ప్రతిపాదనను కేంద్ర దృష్టికి తీసుకెళ్లడంతో రూ.10, 20 ప్లాస్టిక్ నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే దేశంలో ప్లాస్టిక్ నోట్లు చలామనిలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ ప్లాస్టిక్ నోట్ల తయారీ ప్రాజెక్టును ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనుంది. అయితే తాజాగా ఈ సంస్ధ నోట్ల తయారీకి కావాల్సిన ప్రత్యేక ముడి పదార్థాలను సరఫరా చేసే కంపెనీల ఎంపిక చేసేందుకు ప్రతిపాదనలు పిలిచింది. నోట్లపై ప్రింటింగ్, ఇంక్ సరిగ్గా అంటుకోవాలంటే బీఓపీపీ అనే ప్రత్యేక పాలిమర్ సబ్‌స్ట్రేట్ మెటీరియల్ కావాల్సి ఉంటుంది. తాజా ప్రతిపాదనల ప్రకారం మొత్తం 68,000 రీమ్‌ల మెటీరియల్ అవసరం కాగా, రూ.10 నోట్ల కోసం 34,000 రీమ్‌లు, రూ.20 నోట్ల కోసం మరో 34,000 రీమ్‌లను సేకరించనున్నారు. అయితే ఈ నోట్లకు కావాల్సిన మెటీరియల్ సరఫరా చేసేందుకు భారతీయ సంస్థ అయిన యూఫ్లెక్స్, అమెరికాకు చెందిన స్పెక్ట్రా సిస్టమ్స్ అనే రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా బిడ్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వీటిలో యూఫ్లెక్స్ సంస్ధ నోట్ల తయారీని చూసుకుంటే, స్పెక్ట్రా సిస్టమ్స్ సంస్థ నోట్లకు సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేయనుంది. అయితే, దీనిపై ఆయా సంస్ధల నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఈ ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలనే ప్రతిపాదన ఇప్పటిదేం కాదు, 2012లోనే ఈ నోట్లను ఫీల్డ్‌లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రయత్నించింది. దేశంలోని ఐదు నగరాలైన కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లాలో రూ.10 ప్లాస్టిక్ నోట్లపై పైలట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసింది. కానీ అప్పుడూ ఏటీఎంలు, క్యాష్ మెషీన్లలో సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ప్రస్తుతం కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను మళ్లీ కొనసాగిస్తోంది.
ليست هناك تعليقات:
إرسال تعليق