కొత్త ఏఐ మోడల్ జెమినీ 4 ఆర్గాన్‌ను ప్రకటించిన గూగుల్

الخميس، 1 أكتوبر 2026

company revealed that it developed this model with software engineering and cybersecurity needs in mind Google Announces New AI Model: Gemini 4 Argon technology

t f B! P L

గూగుల్ తన కొత్త ఏఐ మోడల్ జెమినీ 4 ఆర్గాన్‌ను ప్రకటించింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. ఈ మోడల్‌లో కీలక మార్పు ఏంటంటే అవుట్‌పుట్ సామర్థ్యం. జెమినీ 4 ఆర్గాన్ గరిష్ఠంగా 10 లక్షల అవుట్‌పుట్ టోకెన్లను రూపొందించగలదు. గత మోడల్‌లో ఈ పరిమితి 64 వేల టోకెన్లుగా ఉంది. సుదీర్ఘమైన పనులను ఒకే సందర్భంలో నిర్వహించేందుకు ఈ సామర్థ్యం ఉపయోగపడుతుందని గూగుల్ పేర్కొంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో DeepSWE v1.1 టెస్టింగ్‌లో 77.9 శాతం, లాంగ్ వీడియోలను అర్థం చేసుకునే LVBenchలో 91.7 శాతం స్కోర్ సాధించినట్లు సంస్థ తెలిపింది. వ్యాపార ఆటోమేషన్‌కు సంబంధించిన AutomationBenchలో 51.3 శాతం స్కోర్ నమోదైంది. గూగుల్ తన అంతర్గత ఇంజినీరింగ్ పనుల్లోనూ ఆర్గాన్‌ను ఉపయోగిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, కోడ్‌బేస్ మార్పులు వంటి పనులతో పాటు Rust ఆధారిత libgav1 వీడియో డీకోడర్ అభివృద్ధిలో మోడల్ సహాయపడిందని తెలిపింది. ఆ డీకోడర్ ఇప్పటికే ఉన్న Rust వెర్షన్ కంటే 2.7 రెట్లు వేగంగా పనిచేసిందని పేర్కొంది. సైబర్‌సెక్యూరిటీలో లోపాలను గుర్తించడం, ధృవీకరించడం, పరిష్కరించడంలో ఆర్గాన్‌ను పరీక్షిస్తున్నారు. CWE-bench v1లో 68 శాతం స్కోర్ సాధించింది. తొలుత Fairwind Program ద్వారా ఎంపికైన సైబర్‌సెక్యూరిటీ నిపుణులకు అందుబాటులోకి వస్తుంది. తరువాత చెల్లింపు API వినియోగదారులు, Google AI Ultra సభ్యులకు, ఆపై డెవలపర్లు, సంస్థలు, సాధారణ వినియోగదారులకు విస్తరించనుంది. API ధర ఇన్‌పుట్‌కు మిలియన్ టోకెన్లకు 2 డాలర్లు, అవుట్‌పుట్‌కు మిలియన్ టోకెన్లకు 10 డాలర్లుగా గూగుల్ తెలిపింది. విస్తృత విడుదలకు ముందు సైబర్ దుర్వినియోగం, CBRN దుర్వినియోగం, పరోక్ష ప్రాంప్ట్ ఇంజెక్షన్, ఊహించని మోడల్ ప్రవర్తనను నియంత్రించే భద్రతా చర్యలను సంస్థ పరీక్షిస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ