దేశంలోని చలనచిత్ర పరిశ్రమలో ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. పన్ను ఎగవేత, సినిమాల పేరుతో విదేశాలకు నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ముంబై ఐటీ విభాగం ఒకేసారి పలువురు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్, నిర్మాత వాసు భగ్నానీతో పాటు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పనోరమా స్టూడియోస్‌కు చెందిన సుమారు 12 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతుండటంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. విదేశాల్లో సినిమాల చిత్రీకరణ, ఓవర్సీస్ పంపిణీ హక్కులు, చిత్ర నిర్మాణ వ్యయాల పేరుతో భారీ మొత్తంలో నిధులను ఇతర దేశాలకు తరలించినట్లు ఆదాయపు పన్ను శాఖకు పక్కా సమాచారం అందడం.. ఈ మెరుపు దాడులకు కారణమైంది. ఈ లావాదేవీల్లో పెద్ద ఎత్తున పన్నుల అవకతవకలు, ఆర్థిక అక్రమాలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తోన్నాయి. నిధుల మళ్లింపు వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయడానికి ముంబై ఐటీ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఫిల్మ్ ఇండస్ట్రీపై ఆదాయపు పన్ను శాఖ ఆకస్మిక దాడులు
الاثنين، 28 سبتمبر 2026
12 locations actress Rakul Preet Singh Income Tax Department Conducts Surprise Raids on Film Industry national producer Vashu Bhagnani production house Panorama Studio
ليست هناك تعليقات:
إرسال تعليق