ホーム
/
stock market
/
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలు భారీ పతనం
الاثنين، 28 سبتمبر 2026
*Massive Drop in Bombay Stock Exchange Indices 000 points 900 mark business national Nifty fell below the 22 plummeted by over 1 stock market
ఈరోజు ట్రేడింగ్ ప్రారంభంలోనే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 22,900 మార్క్ దిగువకు పడిపోయి ఇన్వెస్టర్లను హడలెత్తించింది. మార్కెట్‌లో నెలకొన్న ఈ తీవ్ర విక్రయాల హోరు కారణంగా బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపు రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోవడంతో మదుపర్లు లబోదిబోమంటున్నారు. మార్కెట్ ప్రారంభమైన గంటలోపే సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లు నష్టాల బాటలోనే పయనించడం గమనార్హం. గత వారమంతా నష్టాలతోనే ముగిసిన మార్కెట్లు, ఈవారూ అదే పంథాను కొనసాగించడం ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తోంది. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో మళ్లీ పెరుగుతున్న ముడి చమురు ధరలే. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106 డాలర్లకు పైగా ఎగబాకడంతో మార్కెట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి వద్ద ఏడు నెలలుగా కొనసాగుతున్న రవాణా అంతరాయాలు చమురు మంటలను రాజేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడంతో సంక్షోభం మరింత ముదిరింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన భారత్‌పై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. స్థానిక మార్కెట్ల పతనానికి విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కూడా మరో ప్రధాన కారణాంగా నిలిచాయి. సెప్టెంబర్ నెల ఒక్క నెలలోనే వారు వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించగా, ఈ ఏడాదిలో వారి మొత్తం అమ్మకాల విలువ 25 బిలియన్ డాలర్లకు చేరుకుంది. విదేశీ మదుపర్లు మన మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో రూపాయి విలువపై కూడా తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత బలహీనపడుతుండటం ఆర్థిక నిపుణులను కలవరపెడుతోంది.
ليست هناك تعليقات:
إرسال تعليق