గాయని అలెక్సిస్ విల్కిన్స్ తో నిశ్చితార్థం చేసుకున్న ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ : సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటన
الاثنين، 5 أكتوبر 2026
america FBI Director Kash Patel Engaged to Singer Alexis Wilkins international Official Announcement Made via Social Media with whom he has been in a relationship for some time
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న దేశీయ సంగీత గాయని అలెక్సిస్ విల్కిన్స్ తో ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. 27 ఏళ్ల అలెక్సిస్ విల్కిన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో డైమండ్ ఉంగరాన్ని ప్రదర్శిస్తూ కాష్ పటేల్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు. "చివరకు చట్టాన్ని రంగంలోకి దించేశాను" అంటూ ఆమె క్యాప్షన్ పెట్టగా, 46 ఏళ్ల కాష్ పటేల్ కూడా ఆ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ హార్ట్, డైమండ్ రింగ్ ఎమోజీలను జతచేశారు. నాష్‌విల్లేలో 2022లో ఓ మిత్రుడి వేడుకలో కలుసుకున్న ఈ ఇద్దరూ, ఆ మరుసటి సంవత్సరం నుంచి డేటింగ్‌లో ఉన్నారు. కాష్ పటేల్ 2025 ఫిబ్రవరిలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీరి రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన వార్తలు మీడియాలో తరచూ చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే, వీరిద్దరి బంధం గతంలో పలు వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారింది. ప్రభుత్వ విమానాల వ్యక్తిగత వాడకంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. గత ఏడాది మే నెలలో వాషింగ్టన్ నుంచి ఫిలడెల్ఫియాకు ఎఫ్‌బీఐ గల్ఫ్‌స్ట్రీమ్ V విమానంలో పటేల్, విల్కిన్స్ ప్రయాణించి ఒక కంట్రీ మ్యూజిక్ కాన్సర్ట్‌కు హాజరయ్యారని, ఆ సమయంలో ప్రైవేట్ సూట్ కోసం వేల డాలర్లు ఖర్చు చేశారంటూ 'న్యూయార్క్ టైమ్స్' కథనం ప్రచురించింది. అలాగే నవంబర్ 2025లో పెన్ స్టేట్ యూనివర్సిటీలో జరిగిన విల్కిన్స్ మ్యూజిక్ షోకు వెళ్లేందుకు కూడా పటేల్ ఎఫ్‌బీఐ విమానాన్ని వాడారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విమర్శలను ఎఫ్‌బీఐ, కాశ్ పటేల్ తిప్పికొట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ఎఫ్‌బీఐ చీఫ్ అధికారిక విమానాలను ఉపయోగించాల్సి ఉంటుందని, నిబంధనల ప్రకారమే ముందుగానే ప్రభుత్వానికి డబ్బులు రీయింబర్స్ చేస్తున్నామని ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది. తన భాగస్వామి అలెక్సిస్‌పై వస్తున్న నిరాధార ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, ఆమెను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని పటేల్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు. మరోవైపు, బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడి కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలిస్తున్న సమయంలో, పటేల్ ఒక పాడ్‌కాస్ట్‌లో తన ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడటం కూడా అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది.
ليست هناك تعليقات:
إرسال تعليق