పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు 15 రోజుల్లో తిరిగి రావాలి : గడువు విధించిన మమతా బెనర్జీ

الاثنين، 5 أكتوبر 2026

labeling them as "traitors." Mamata Banerjee sets a deadline MPs and MLAs who left the party must return within 15 days national west bengal

t f B! P L

ఉత్తర బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా భారీ స్థాయిలో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ పార్టీని వీడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు 15 రోజుల్లో తిరిగి రావాలని గడువు విధించారు. తన పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత బయటకు వెళ్లిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను ద్రోహులుగా అభివర్ణిస్తూ ఘాటు విమర్శలు చేశారు. వారు 15 రోజుల్లో తిరిగి వస్తే ఆహ్వానిస్తామని, ఆ తర్వాత వారికి పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆమె, పార్టీకి అసలైన బలం నాయకులు కాదని, క్షేత్రస్థాయి కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఎన్నికల సంఘంపైనా మమత తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ బాధ్యతల్లో ఉన్నంతకాలం బీజేపీ అధికారంలో కొనసాగుతుందని ఆమె ఆరోపించారు. 1998లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను తానే స్థాపించిన విషయాన్ని గుర్తుచేస్తూ పార్టీని మరోసారి బలోపేతం చేయగలనని అన్నారు. దేశవ్యాప్తంగా విపక్ష కూటమి బలోపేతానికి కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలకమని మమత పేర్కొన్నారు. తృణమూల్‌ లేకుండా ఇండియా కూటమి బలంగా ఉండదు. బీజేపీని ఎదుర్కోవాలంటే తృణమూల్‌ను బలోపేతం చేయాలి అని ఆమె పిలుపునిచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement


    QooQ