డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అల్పాహారం పథకం : నవంబర్ 30 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

Friday, October 2, 2026

CM Revanth Reddy Directs Officials to Complete Arrangements by November 30 Statewide Breakfast Scheme to Launch on December 9 telangana

t f B! P L

తెలంగాణలో డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అల్పాహారం పథకాన్ని ప్రారంభించేందుకు వీలుగా నవంబర్ 30 నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ పథకంలో భాగంగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందాలు నేడు సీఎం సమక్షంలో జరిగాయి. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్లు ప్రారంభమవ్వాలని స్పష్టంగా చేశారు. ముఖ్యమంత్రిని  జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పోషకాలతో కూడిన అల్పాహారం  అందించే బృహత్తర కార్యక్రమంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యంత ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుకు సహకారం అందిస్తున్న జున్నా సోలార్ సిస్టమ్స్ సీఎండీ శేఖర్ రెడ్డి, సీఈఓ అనిల్ బాబు రూ. 5.17 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందజేశారు. ఈ నిధులతో నాగర్‌కర్నూల్ పరిధిలోని పాఠశాల విద్యార్థులకు స్వచ్ఛమైన, వేడివేడి టిఫిన్ తయారీకి అవసరమైన కిచెన్ మౌలిక వసతులను నిర్మించనున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం నిర్మించనున్న ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం చైన్ ల్యాబ్య్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ ప్రతినిధి సమంత డే, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ లు రూ.4కోట్ల విలువైన ఆర్థిక సాయం చెక్కును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ ప్రతినిధులకు అందించారు. సామాజిక బాధ్యతతో విద్యార్థుల పోషకాహారం కోసం విరాళాలు అందించిన ఉభయ సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పనుల గడువును స్పష్టం చేశారు. నవంబర్ 30వ తేదీలోగా నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో నిర్మిస్తున్న సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం డిసెంబర్ 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ సెంట్రల్ కిచెన్ల సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కిచెన్లలో ఆహారం తయారయ్యే విధానం, పరిశుభ్రతను నేరుగా తెలుసుకునేలా విద్యార్థులకు ఆయా సెంట్రల్ కిచెన్ల సందర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని.. విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల క్యాలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలన్నారు. బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని.. ఆహార నాణ్యత విషయంలో జాగ్రత్తలు పాటించాలని సీఎం ఆదేశించారు. ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్ తయారు చేయాలని సీఎ స్పష్టం చేశారు. సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తామన్నారు. జీవితకాలం కొనసాగే కార్యక్రమం ఇది అని.. కాబట్టి అత్యంత జాగ్రత్త వహించాలన్నారు. నవంబర్ 30లోగా సెంట్రల్ కిచెన్లు పూర్తి అయ్యేలా చూడాలని.. డిసెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సెంట్రల్ కిచెన్ల ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి సత్య గౌర చంద్రదాస్ స్వామీజీ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ