ホーム
/
technology
/
అక్టోబర్ 3న విజయవాడలో పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026
Thursday, October 1, 2026
and technology giants Andhra Pradesh entrepreneurs high-profile summit to bring together IIT experts Pan-IIT Andhra Pradesh Summit 2026 in Vijayawada on October 3 technology
అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠ కలిగిన పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026కు ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తోంది. విజయవాడ బకింగ్‌హామ్ పేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళావేదికలో అక్టోబర్ 3న ఈ సదస్సు వైభవంగా జరగనుంది. దేశవిదేశాల్లోని ఐఐటీ నిపుణులను, పారిశ్రామిక వేత్తలను, సాంకేతిక దిగ్గజాలను ఒకే వేదికపైకి తెస్తూ ప్రభుత్వం ఈ సదస్సును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దేశంలోని 23 అత్యున్నత ఐఐటీ సంస్థలను ఒకే విజన్ కిందకు తేవడంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఐదు లక్షలకు పైగా ఐఐటీ గ్లోబల్ అలూమ్ని నెట్‌వర్క్ నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి జోడించడమే ఈ సమ్మిట్ ప్రధాన లక్ష్యం. పీపుల్, ఐడియాస్, ఇంపాక్ట్ అనే నినాదంతో సాగే ఈ మేధోమథనంలో 800 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి కీలక ప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దేశ సాంకేతిక సార్వభౌమత్వాన్ని పెంపొందించడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణలను రాష్ట్రంలో ప్రోత్సహించేందుకు ఈ వేదిక బాటలు వేయనుంది. సహజంగానే ఐటీ, పారిశ్రామిక రంగాలలో ముందుచూపుతో అడుగులు వేసే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ సమ్మిట్ రూపుదిద్దుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ , విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నాలెడ్జ్ ఎకానమీని పరుగులు పెట్టించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐఐటీయన్ల అనుభవాన్ని ఏపీలోకి పరిశ్రమలు, స్టార్టప్‌లు, ఏఐ , గ్రీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల రూపంలో మళ్లించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. గ్లోబల్ ఐఐటీ ప్రతినిధులను రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ ఆవిష్కరణల హబ్‌గా నిలబెట్టాలన్న సంకల్పం ఈ సమ్మిట్ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment