బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలి !
Thursday, October 1, 2026
Andhra Pradesh Botsa Satyanarayana demands he must introduce a bill in Parliament If Chandrababu is sincere about BCs
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగానే బీసీలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. మోసం చేయడం, మాయ చేయడం చంద్రబాబుకు అలవాటేనని, ఇప్పుడు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు బీసీల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయంగా అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీనేనని ఆయన స్పష్టం చేశారు. 'సుప్రీంకోర్టుకు వెళ్తానని బాబు చెప్తున్నారు. ఇది మోసం చేయడం కాదా?, బీసీల పట్ల చంద్రబాబుకు ప్రేమ ఉంటే రాజ్యాంగ సవరణ చేయండి వెన్నుపోటు పార్టీలో ఉన్న బీసీ నేతలు.. చంద్రబాబును ఎందుకు నిలదీయరు?, ఎన్నికల కోసం బాబు రాజకీయ డ్రామాలాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు చంద్రబాబు మోసాలను గమనించాలి. చంద్రబాబు మోసాల పట్ల బీసీ సోదరులు అప్రమత్తంగా ఉండాలి. బీసీల మనోభావాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కోర్టుల తీర్పులు తెలిసి ఉండి కూడా చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు మానవతాదృక్పథం ఉండదు.. ప్రతీది రాజకీయమే. మోసం చేయడం అనేది చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. బీసీలకు చంద్రబాబు ఎన్ని రాజ్యాంగ పదవులు ఇచ్చారో చెప్పగలరా?, బీసీలకు చంద్రబాబు ఎన్ని రాజ్యాంగ పదవులు ఇచ్చారో ఎల్లో మీడియా రాయగలదా?' అని ప్రశ్నించారు.
No comments:
Post a Comment