ఒంగోలులో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 120 మంది లబ్ధిదారులకు రూ.68 లక్షల 12 వేల విలువైన చెక్కుల పంపిణీ

Friday, October 2, 2026

Andhra Pradesh Distribution of Cheques via Chief Minister's Relief Fund in Ongole Worth ₹68.12 Lakhs to 120 Beneficiaries

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్యలతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 120 మంది లబ్ధిదారులకు రూ.68 లక్షల 12 వేల విలువైన చెక్కులను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ