సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం
الأربعاء، 23 سبتمبر 2026
Andhra Pradesh Cabinet Approves Empanelment Policy for Social Media Influencers Eligible influencers will be issued ID cards following a review of their applications
ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంప్యానెల్‌మెంట్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల ఎంప్యానెల్‌మెంట్ కోసం రూపొందించిన పాలసీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎంప్యానెల్‌మెంట్ ప్రక్రియను సులభంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు త్వరలో ప్రత్యేక యాప్‌ను ప్రారంభించనున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి, వివరాలను వెరిఫై చేసిన అనంతరం అర్హత కలిగిన వారికి ఐడీ కార్డులను జారీ చేయనున్నారు. అలాగే, ఇన్‌ఫ్లుయెన్సర్ల కేటగిరీ, రీచ్, పనితీరు తదితర ప్రమాణాల ఆధారంగా వివిధ కేటగిరీలను రూపొందించి, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో ఇన్‌ఫ్లుయెన్సర్లను భాగస్వామ్యం చేసే విధానానికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రజలకు మరింత విస్తృతంగా, సమర్థవంతంగా చేరవేయనున్నారు. తాజా విధానం ప్రకారం రాష్ట్రంలో విశ్వసనీయమైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను గుర్తించి ధ్రువీకరించే విధానం అమలు చేయనున్నారు. ప్రభుత్వ సమాచార ప్రచారానికి నిబంధనలతో కూడిన ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీ రూపకల్పన జరగనుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై వీడియోలు, పోస్టులకు వ్యూస్, ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కేటగిరీల విభజన జరగనుంది. వీటి ఆధారంగానే వారికి నెలవారీ చెల్లింపులు చేయబోతున్నారు. ఏ కేటగిరీ - లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి నెలకు గరిష్ఠంగా రూ.15,000, బీ కేటగిరీ - 50,000 నుంచి 99,999 ఫాలోవర్లకు రూ.7,500, సీ కేటగిరీ - 25,000 నుంచి 49,999 ఫాలోవర్లకు రూ.5,000, డీ కేటగిరీ - 10,000 నుంచి 24,999 ఫాలోవర్లకు రూ.2,500.
ليست هناك تعليقات:
إرسال تعليق