అక్టోబర్ 25 నుంచి భోగాపురం నుంచి నేరుగా ఢిల్లీకి ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు

الأربعاء، 23 سبتمبر 2026

Akasa Air to Launch Direct Flights from Bhogapuram to Delhi Starting October 25 ​​Andhra Pradesh Union Civil Aviation Minister Kinjarapu Rammohan Naidu

t f B! P L

భోగాపురం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనుండటం సంతోషకరంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు, ప్రయాణికులకు మరింత ఎంపిక, సౌకర్యాన్ని ఈ కొత్త విమాన సర్వీసు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానుండగా, ఉదయం 5:55 కు డిల్లీ లో ప్రారంభమై 8:20 కి భోగాపురం చేరుకోనుంది. మళ్ళీ భోగాపురంలో 09:05 నిమిషాలకు ప్రారంభమై.. 11:30 కు ఢిల్లీ చేరుకుంటుంది. భోగాపురం విమానాశ్రయం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ మరింత విస్తరించడంతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన రంగం, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మూడు సంవత్సరాల విరామం తర్వాత ఆకాశ ఎయిర్ తిరిగి విశాఖపట్నం ప్రాంతంలో తన విమాన సేవలను ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధితో ఉత్తరాంధ్రను దేశంలోని వివిధ ప్రాంతాలతో మెరుగైన వైమానిక కనెక్టివిటీతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు, గమ్యస్థానాల సంఖ్యను మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ