నీ వల్లే నా అన్న చనిపోయాడని భార్యతో పాటు నలుగురిని తుపాకీతో కాల్చి చంపిన భర్త

الأربعاء، 23 سبتمبر 2026

Azamgarh claiming she was responsible for his brother's death crime Husband shoots dead four people including his wife Uttar Pradesh

t f B! P L

త్తర ప్రదేశ్ లోని అజమ్‌గఢ్‌లో అరవింద్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడు మరియు ఇంట్లో పూజ చేస్తున్న ఇద్దరు పూజారులతో సహా నలుగురిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన భారత్‌ అంతటా తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. ఈ ఘోర హత్యల వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన కోణం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. హంతకుడు అరవింద్ పెద్ద అన్న సునీల్ సింగ్ గత 2019వ సంవత్సరంలో హత్యకు గురయ్యాడు. దానికి అరవింద్ భార్య బబితా అక్రమ సంబంధమే కారణమని, బబిత వల్లే తన అన్న చనిపోయాడని అరవింద్ తీవ్ర ఆక్రోశంతో ఉన్నాడు. మరణించిన అన్న ఆత్మ వేధిస్తోందని చెబుతూ బబిత, ఆమె తల్లి కలిసి ఇంట్లో 'మహా మృత్యుంజయ' పూజకు ఏర్పాట్లు చేశారు. మొదటి నుంచీ ఈ పూజను అరవింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అక్కడ పూజ జరుగుతుండటం చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అక్కడ ఉన్న పూజారులను గుర్తింపు కార్డులు చూపించమని గద్దించిన అరవింద్, దాన్ని నిలదీసిన భార్యతో "నీ వల్లే నా అన్న హత్యకు గురయ్యాడు, నువ్వేమో ఇక్కడ నాటకాలు ఆడుతున్నావు" అని అరుస్తూ తన సోదరుడి తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. అనంతరం ఆ ఇద్దరు పూజారులను కూడా కాల్చివేసి, ఆ తర్వాత గదిలోకి వెళ్లి తన కుమారుల్లో ఒకరిని కాల్చి చంపి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ దారుణ నరమేధం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా గాలిస్తున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ