సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 11 గంటల నుంచి జరగనున్న స్వర్ణభారత్ ట్రస్ట్, వెంకటాచలం (నెల్లూరు) రజతోత్సవాలకు సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు వెంకటాచలం చేరుకోనున్న శ్రీ యోగి ఆదిత్య నాథ్ 11.30 గంటలకు అక్షర విద్యాలయం ప్రాంగణంలో ఉన్న సోమా నైపుణ్య కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం 12.00 గంటలకు అక్షర విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం 2.00 గంటలకు స్వర్ణభారత్ ట్రస్ట్ కు చేరుకుని రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు మానసపుత్రికగా 25 ఏళ్ళ క్రితం ప్రభవించిన స్వర్ణభారత్ ట్రస్ట్ లక్షలాది మంది పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువత జీవితాల్లో వెలుగులు నింపింది. నైపుణ్యాభివృద్ధి ద్వారా వారి సాధికారికతకు బాటలు వేసింది. ముచ్చింతల్ (హైదరాబాద్ చాప్టర్, ఆత్కూర్ (విజయవాడ చాప్టర్) ద్వారా సేవలను విస్తరిస్తూ... దేశవ్యాప్తంగా ఎంతో మంది యువతకు ఉచిత వసతితో పాటు నైపుణ్య శిక్షణను అందించి వారు తమ కాళ్ళమీద నిలబడేలా చొరవ తీసుకుంది. సంపూర్ణ గ్రామీణ సాధికారత సాధనలో 25 ఏళ్ళ సేవా వసంతాలను పూర్తి చేసుకున్న స్వర్ణ భారత్ ట్రస్ట్... సెప్టెంబర్ 7, సోమవారం మధ్యాహ్నం 2.00 గంటల నుంచి నెల్లూరు వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రజామందిరంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ తో పాటు పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి శ్రీ పొంగూరు నారాయణ, శాసనసభ సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహణా బృందం తెలియజేసింది.
స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవాలు : ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
السبت، 5 سبتمبر 2026
Andhra Pradesh announced Managing Trustee of Swarna Bharat Trust September 7th. Smt. Deepa Venkat Swarna Bharat Trust Silver Jubilee Celebrations UP CM Yogi Adityanath to Attend as Chief Guest
ليست هناك تعليقات:
إرسال تعليق