ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తల్లీకూతురు మృతి : కాపాడేందుకు వెళ్లిన యువకుడికి తీవ్ర గాయాలు
الخميس، 24 سبتمبر 2026
Anakapalli district Andhra Pradesh Mother and Daughter Die of Accidental Electrocution Nathavaram Youth Injured While Attempting Rescue
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా నాతవరంలో తల్లీకూతురు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన నాగరాజు అనే యువకుడికి గాయాలు కాగా తీవ్ర గాయాలతో తల్లీకూతురు మృతి చెందారు . ఈ ఘటనపై శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . తీవ్రంగా గాయపడ్డ నాగరాజుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తలరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق