భారత ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకంపనలు రేపుతోంది. ఎస్‌ఐఆర్‌లో చాలా అవకతవకలున్నాయని ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్న నేపథ్యంలో ఈ ఆరోపణలు పెద్ద దుమారాన్నే రాజేశాయి. తక్షణమే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఎస్‌ఐఆర్ విషయంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను సీఈసీ జ్ఞానేశ్ కుమార్ పట్టించుకోలేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రౌత్ డిమాండ్ చేశారు. పది నెలల్లో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (సుఖ్‌బీర్ సింధు సంధు, వివేక్ జోషి) 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, జ్ఞానేశ్ కుమార్ వాటిని పట్టించుకోలేదని ఓ మీడియా నివేదిక వెల్లడించింది. ఫారం-6 , ఇతర అంశాలపై వారు లేవనెత్తిన అభ్యంతరాలను విస్మరించి ముందుకు వెళ్లారని రౌత్ ఆరోపించారు. జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే తొలగించి ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఆయన్ను బర్తరఫ్ చేయాలని రౌత్ డిమాండ్ చేశారు.అమిత్ షా నంబర్ వన్ నేరస్థుడు. ప్రధాని దేశాన్ని కాపాడాలనుకుంటే, అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని రౌత్ చాలా తీవ్రంగా స్పందించారు. అంతేకాదు మోదీ చర్య తీసుకోకపోతే, మూడు రక్షణ దళాలకు అధిపతి అయిన రాష్ట్రపతిని జ్ఞానేష్ కుమార్‌ను తొలగించమని కోరుతాను. రాష్ట్రపతి కూడా చర్య తీసుకోకపోతే, అటువంటి 'హుకుమ్‌షాహోన్' (నిరంకుశ పాలకులు) నుండి దేశాన్ని రక్షించడానికి ఆర్మీ చీఫ్ ముందుకు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం అంశంపై న్యాయవ్యవస్థ స్వయంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ కోరారు. SIR ప్రక్రియతో బీజేపీ ఆటలాడుతోందని డీఎంకే అధికార ప్రతినిధి ఎలాంగోవన్ బుధవారం మండిపడ్డారు. వారు ఈ దేశం నుండి ముస్లింలను తొలగించాలనుకుంటున్నారు. అదే వారి ఉద్దేశ్యం. వారు దీనిని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్నారు, కానీ అది అసాధ్యం. ఎందుకంటే చట్టం ప్రకారం, ప్రజలు ఓటర్లుగా నమోదై చాలా కాలంగా ఇక్కడ నివసిస్తున్నారు, వారిని జీవించడానికి అనుమతించాలి. SIR ద్వారా ప్రభుత్వం వారి పేర్లను ఓటర్ల జాబితాల నుండి తొలగించలేదని విమర్శించారు. ఆ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై స్పందించిన శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే కూడా ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ ఒక పార్టీకి ఏజెంట్‌గా మారి భారతదేశాన్ని "ప్రపంచంలోనే అతిపెద్ద మాజీ ప్రజాస్వామ్య దేశంగా" మార్చిందని, లక్షలాది మంది భారతీయుల ఓటు హక్కును హరించివేసిందని మండిపడ్డారు. జ్ఞానేశ్ కుమార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఈ దేశద్రోహానికి పాల్పడ్డారని, పశ్చిమ బెంగాల్, బిహార్ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఈ కుట్రే కారణమని రౌత్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ సింఘ్వీ ఈ రోజు తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు.దీంతో మరింత చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మరోవైపు ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో సభ్యుల మధ్య కీలక సమస్యలు ఉన్నాయని 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్'లో వచ్చిన కథనాన్ని ఖండిస్తూ భారత ఎన్నికల సంఘంఒక ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది కాలంలో తాము తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని, ఏ సంస్థలోనైనా చర్చల సమయంలో భిన్నమైన అభిప్రాయాలు, పరిశీలనలు వ్యక్తమవ్వడం సహజమని స్పష్టం చేసింది. తుది నిర్ణయం తీసుకునే ముందు జరిగే నిర్ణయ-ప్రక్రియలో ఇదొక భాగం. కేవలం ఆ ముగ్గురు కమిషనర్లే కాకుండా, ఎన్నికల వ్యవస్థను మెరుగు పరచడానికి కమిషన్‌కు తమ సూచనలను అందించే పూర్తి అధికారం కమిషన్‌లోని ప్రతి అధికారికి ఉంటుందని ఈసీఐ బుధవారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎన్నికల సంఘంలో ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులు ఉన్నారు: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి. అయితే తమకు తెలియకుండానే ఎన్నికల సంఘం తీసుకున్న అనేక నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అధికారికంగా అభ్యంతరం వ్యక్తం చేశారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
ఎన్నికల కమిషన్‌లో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక : ఊపందుకున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
Wednesday, September 23, 2026
calls for CEC Gyanesh Kumar's resignation gain momentum Indian Express report reveals internal rifts in the Election Commission national Shiv Sena (UBT) MP Sanjay Raut alleged
No comments:
Post a Comment