సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో గురువారం జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ఏటా మనమందరం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ విమోచనం కోసం పోరాడిన ఎంతోమంది వీరులను స్మరించుకునేందుకు, వారి వీరగాథలు భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు 2022 నుంచి ఈరోజును కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నామన్నారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ అనేక సంస్థానాల విషయంలో సందిగ్ధత కొనసాగిందన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో ఆ సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమయ్యాయని, అందులో హైదరాబాద్ సంస్థానం కూడా ఒకటి అని గుర్తు చేశారు. పటేల్ ఎంతో ముందుచూపుతో ఈ బాధ్యతను భుజాన వేసుకుని సమర్థవంతంగా నిర్వర్తించి వేలాది సంస్థానాలను భారత దేశంలో విలీనం చేశారన్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిజాం రాజు నిరాకరించడంతో ఆపరేషన్ పోలో చర్య జరపాల్సి వచ్చిందని, అనంతరం నిజాం సైన్యం లొంగిపోవడంతో హైదరాబాద్ సంస్థానాన్ని 1948 సెప్టెంబర్ 17న విలీనం చేశారని చెప్పారు. ఈ విషయంలో సర్దార్ వల్లభ్ భాjáYT పాత్ర మరువలేనిదన్నారు. హైదరాబాద్ వంటి సంస్థానాలను విలీనం చేసి సర్దార్ పటేల్ దేశాన్ని ఉక్కు మాదిరి దృఢంగా నిర్మించారని కొనియాడారు. గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్రం రావడంలో ఎంత కీలక పాత్ర పోషించారో భారతదేశాన్ని ముక్కలు కాకుండా కాపాడటంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతే కీలకపాత్ర పోషించారన్నారు. 1947-1948 మధ్యకాలంలో భారతదేశ నిర్మాణంలో కేంద్ర బలగాలు ఎంతో కృషి చేశాయన్నారు. నక్సల్ రహిత భారత్‌గా, ప్రతి రాష్ట్రం శాంతిభధ్రతల సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని ఉప రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇందులో భాగంగా నక్సలిజం నిర్మూలనలో కూడా ఈ బలగాలు ఎంతో కీలక పాత్ర పోషించాయన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, ఆయన పర్యవేక్షణలో వామపక్ష తీవ్రవాదమైన నక్సలిజం దేశంలో అంతమైందన్నారు. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో నక్సలిజం పూర్తిగా కనుమరుగైన తర్వాత ఎంతో అభివృద్ధి జరుగుతోందన్నారు. దీంతో రాష్ట్రంలోని యువతకు ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారని, రాంజీ గోండు, కుమ్రం భీం, తుర్రేబాజ్ ఖాన్ వంటి ఎందరో గొప్ప వారి త్యాగాల వల్లే తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పారు. భూభాగాన్ని కలుపుకొన్నంత మాత్రాన దేశ సమైక్యత నిలవదు.. దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు, సమాన గౌరవం కల్పిస్తేనే సమైక్యత బలపడుతుంది అని ఆయన ఉద్ఘాటించారు. వేర్వేరు భాషలు, వేర్వేరు దేవుళ్లను పూజించినా.. వేర్వేరు అభిప్రాయాలు ఉన్నా అందరినీ మన రాజ్యాంగం ఒక్కటిగా చూస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యేందుకు నిజాం పాలనలోని రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిని వీరులందరికీ అలాగే సర్వార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత పరేడ్ గ్రౌండ్స్‌లోని వార్ మెమోరియల్ వద్ద 'రీత్ సెర్మనీ' (పుష్పగుచ్ఛం ఉంచే కార్యక్రమం) ద్వారా దేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరులకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కిషన్‌రెడ్డిలు నివాళుýర్పించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, బండి సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చొరవతో ఆ సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమయ్యాయి : హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఉప రాష్ట్రపతి
Thursday, September 17, 2026
All those princely states were merged into India through the initiative of Sardar Vallabhbhai Patel telangana Vice President at Hyderabad Liberation Day
No comments:
Post a Comment