ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని మండలం రాజుల కొత్తూరు సమీపంలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సును ఒక కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులంతా కాకినాడ జిల్లా ఉప్పాడ ప్రాంతానికి చెందినవారుగా అధికారులు గుర్తించారు. తునిలో వివాహ వేడుక ముగిసిన అనంతరం బస్సులో అందరూ తిరిగి ఉప్పాడకు బయలుదేరారు. మార్గమధ్యంలో రాజుల కొత్తూరు సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సు ప్రధాన తలుపులు తెరుచుకోపోవడంతో ప్రయాణికులు బస్సు అత్యవసర కిటికీలు మరియు అద్దాలను పగులగొట్టి బయటకు రావాల్సి వచ్చింది. గాయపడిన 40 మంది బాధితులను వెంటనే స్థానికులు, పోలీసులు కలసి అంబులెన్సుల్లో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం బాధితులకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.
పెళ్లి బస్సును ఢీకొట్టిన కంటైనర్ : 40 మందికి తీవ్ర గాయాలు
Telugu Lo Computer
0
Comments
Post a Comment