పతంజలి నెయ్యిలో కల్తీ లేదు : మందులను సుప్రీంకోర్టు నిషేధించలేదు : రామ్‌దేవ్ బాబా
Wednesday, September 23, 2026
Baba Ramdev national No Adulteration in Patanjali Ghee Supreme Court Has Not Banned Medicines tested at any laboratory in the country
న్యూఢిల్లీలో రామ్‌దేవ్ బాబా మీడియాతో మాట్లాడుతూ పతంజలి నెయ్యి కల్తీ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అన్నారు. అలాగే, తమ సంస్థ తయారు చేసే ఔషధాల్ని నిషేధించారు అంటూ జరుగుతున్న ప్రచారం కూడా అబద్ధం అన్నారు. తమ సంస్థ తయారు చేస్తున్న ఔషధాన్ని సుప్రీంకోర్టు నిషేధించలేదని స్పష్టం చేశారు. పతంజలి రూపొందించే ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, అలాగే, ఇండియాలోని, విదేశాల్లోని అన్ని సంస్థల ప్రమాణాలకు మించి ఉన్నాయని వివరించారు. పతంజలి నెయ్యిలో కూడా ఎలాంటి కల్తీ లేదని, అవసరమనుకుంటే దేశంలోని ఏ ల్యాబ్‌లో అయినా పరీక్షించుకోవచ్చన్నారు. ముఖ్యంగా పతంజలి నెయ్యిలో జంతువుల కొవ్వు, ఎముకల పొడి కలిసిందనే ప్రచారంలో కూడా నిజం లేదన్నారు. కొంతకాలంగా పతంజలి ఉత్పత్తులపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. మరోవైపు పతంజలి ఉత్పత్తులపై బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ చేసిన ఆరోపణలపై కూడా రామ్‌దేవ్ స్పందించారు. ఆయనకు ఈ అంశంపై అవగాహన లేదని, అందరూ చేస్తున్న దుష్ప్రచారం, వదంతుల్ని నమ్మి ఆయన వ్యాఖ్యలు చేశారని రామ్‌దేవ్ వివరించారు. ఈ విషయంలో అన్ని ఆరోపణలకు సమాధానం ఇచ్చామన్నారు. అలాగే, ఆయనపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసును కూడా పతంజలి సంస్థ ఉపసంహరించుకుందని తెలిపారు. డ్రగ్ అండ్ రెమెడీ యాక్ట్ గురించి రామ్‌దేవ్ స్పందిస్తూ.. ఈ చట్టం పాతకాలం నాటిదని, ఈ చట్టాన్ని మార్చాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment