ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలిని మంగళగిరికి చెందిన కళ్యాణిగా గుర్తించారు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 17న కళ్యాణి కనిపించకుండా పోగా అదే రోజు ఆమె హత్యకు గురైనట్లు దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. కళ్యాణి కనిపించకుండా పోయినప్పటి నుంచి ఆమె సోదరుడు ఆచూకీ కోసం వెతుకుతున్నాడు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫొటోల ఆధారంగా ఆమె చేతిపై ఉన్న టాటూను గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎన్టీటీపీఎస్ చన్నీళ్ల కాలువలో రెండ్రోజులుగా మహిళకు సంబంధించిన శరీర భాగాలను వేర్వేరు సమయాల్లో స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటిగా శుక్రవారం మహిళ మొండెంను సేకరించి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం పరిస్థితి మేరకు హత్యగా భావించి, ఆ దిశగా పలు కోణాల్లో వివరాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే మొండెం లభించిన తర్వాత తల, చేతులు, కాళ్లు శనివారం లభించాయి. ఎక్స్‌ఎల్ సైజులో ఉన్న బ్లూ రంగు టాప్ పంజాబీ డ్రస్, లెగ్గిన్, బంగారు రంగులో ఉన్న ముక్కు పుడక, చెవి రింగులు, గాజులు, వెండి పట్టీలు, చేతిపై నల్లని ఈక టాటూను గుర్తించారు. ఈ కేసులో భవానీపురానికి చెందిన షఫీని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. కళ్యాణికి, షఫీకి గతంలో పరిచయం ఉండగా, వీరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. కాగా, ఆమె కుమారుడిని షఫీ పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కుమారుడి విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం ఉన్నట్లు సమాచారం. తన కుమారుడిని తనకు అప్పగించాలని కళ్యాణి షఫీపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే షఫీ ఆమెను హత్య చేసి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ కేసులో పూర్తి కారణాలు, హత్యకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ホーム
/
VIJAYAWADA
/
ఇబ్రహీంపట్నంలో మహిళ శరీర భాగాలు లభ్యమైన కేసు : టాటూ ఆధారంగా కళ్యాణిగా గుర్తించిన పోలీసులు
السبت، 26 سبتمبر 2026
Andhra Pradesh Case of woman's body parts found in Ibrahimpatnam crime Police identify victim as Kalyani based on tattoo VIJAYAWADA
ليست هناك تعليقات:
إرسال تعليق