తిరుపతికి రాకపోకలు సాగించే విమానాల షెడ్యూల్ లో మార్పులు చేసారు. ఈ రోజు నుంచి మార్పులు అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 7:20కి వచ్చి, తిరిగి 8:00 గంటలకు బయలుదేరుతుంది. హైదరాబాద్ - తిరుపతి: ఉదయం 11:15కి వచ్చి, తిరిగి 11:45 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించారు. హైదరాబాద్ - తిరుపతి: మధ్యాహ్నం 1:50కి వచ్చి, తిరిగి 2:30 గంటలకు బయలుదేరనుంది. ఇక, విశాఖపట్నం - తిరుపతి: మధ్యాహ్నం 3:30కి వచ్చి, తిరిగి సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరుతుందని.. కాగా, ఢిల్లీ - తిరుపతి: సాయంత్రం 6:25కి వచ్చి, తిరిగి రాత్రి 7:05 గంటలకు బయలుదేరు తుందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ - తిరుపతి: రాత్రి 8:20కి వచ్చి, తిరిగి రాత్రి 9:00 గంటలకు బయలుదేరేలా మార్పు చేసారు. అదే విధంగా స్టార్ ఎయిర్‌లైన్స్ సర్వీస్ కు చెందిన శివమొగ్గ - తిరుపతి: మధ్యాహ్నం 12:20కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. ఎయిర్ ఇండియా సర్వీస్ కు చెందిన హైదరాబాద్ - తిరుపతి సర్వీసు: సాయంత్రం 5:10కి వచ్చి, తిరిగి సాయంత్రం 6:00 గంటలకు బయలుదేరేలా మార్పులు ప్రకటించారు. ఇక.. ఇప్పటికే విదేశాల నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం రేణిగుంట విమానాశ్రయంలో ఈ వీసా సేవలు ప్రారంభించారు. గతంలో విదేశీ యాత్రికులు చెన్నై లేదా బెంగళూరు విమానాశ్రయాలకు చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వచ్చే వారు. దీనివల్ల ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఖర్చయ్యేది. ఈ నూతన విధానం ద్వారా భక్తులు నేరుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవడానికి మార్గం సులభం అయింది.
తిరుపతికి విమానాల రాకపోకల షెడ్యూల్ మార్పు : ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నా కొత్త టైమ్స్
الثلاثاء، 1 سبتمبر 2026
Andhra Pradesh Changes to Flight Schedules for Tirupati introduced at Renigunta Airport to facilitate national New Timings Effective Today
ليست هناك تعليقات:
إرسال تعليق