తెలంగాణ లోని నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పెద్ద కొడుకుగా ప్రశాంత్ రెడ్డి చెప్పుకుంటారని, కానీ, మహాభారతంలో శకుని వంటి వ్యక్తి ఆయనని మండిపడ్డారు. జీవితంలో హరీశ్ రావు, సంతోశ్ కుమార్‌నైనా క్షమిస్తా కానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించనని కవిత అన్నారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన రెండో రోజే కాంగ్రెస్ నాయకులను ఆయన కలిశారని ఆరోపించారు. కేసీఆర్ పెట్టిన తిండి తిని తండ్రీ, బిడ్డలను విడదీశారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తి రావాల్సిందేనని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. 'నిజామాబాద్ కోడలిగా ఇక్కడ పని చేశా. నాకు మళ్లీ ఒక అవకాశం ఇవ్వండి. మీరే నా ధైర్యం' అని కవిత అన్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే తాను ఎక్కడికైనా, ఏ పార్టీలోకైనా వెళ్లగలనని, కానీ ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులను ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. 'ఎన్ని కేసులు పెట్టినా నేను తప్పు చేయలేదనే చెప్పా. నన్ను తీహార్ జైలులో ఎందుకు పెట్టారు?' అని కవిత ప్రశ్నించారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు కనికరం చూపకుండా పార్టీ నుంచి వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా ఉన్నాను కాబట్టే బాధతో కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. తనను పిరికిదాన్ని అనుకోవద్దని హెచ్చరించారు. జైలులో ఉన్న సమయంలో తన అత్తగారు అండగా నిలిచారని కవిత గుర్తు చేసుకున్నారు. మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టుపైనా తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికీ నీరు అందలేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో అవినీతి జరిగిందని, అప్పటి ఎమ్మెల్యేల ఆస్తులు పదేళ్లలో భారీగా పెరిగాయని విమర్శించారు.
హరీశ్ రావు, సంతోశ్ కుమార్‌నైనా క్షమిస్తా కానీ ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించను : కల్వకుంట్ల కవిత
الاثنين، 31 أغسطس 2026
'Panchajanya Sankalpa Sabha' held in Nizamabad but I will never forgive Prashanth Reddy I might forgive Harish Rao or Santosh Kumar Kalvakuntla Kavitha telangana
ليست هناك تعليقات:
إرسال تعليق