ఇరాన్ దక్షిణ ప్రాంతంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా అమెరికా వైమానిక దాడి జరిగినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా కనీసం ఐదుగురు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్ముజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్ సిరిక్ కౌంటీలోని కుహెస్తాక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న నివాస భవనంపై అమెరికా సైన్యం దాడి చేసినట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై వేర్వేరు వివరాలు వెలువడుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం గాయపడిన వారి సంఖ్య 68 వరకు ఉండొచ్చని సమాచారం.
ఇరాన్ లో పెళ్లి వేడుకపై అమెరికా వైమానిక దాడి : ఐదుగురు మృతి, 50 మందికి గాయాలు
الأربعاء، 2 سبتمبر 2026
50 Injured Five dead international US Airstrike on Wedding Ceremony in Iran Videos related to the event have surfaced and are circulating on social media
ليست هناك تعليقات:
إرسال تعليق