తమ హక్కుల కోసం ఎవరైనా శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవచ్చు !

الأربعاء، 2 سبتمبر 2026

Anyone can peacefully agitate or protest for their rights Tamil Nadu Chief Minister Joseph Vijay Vijay alleged that farmers and teachers had faced severe hardships under the previous DMK government

t f B! P L

ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం ఎవరైనా శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ స్పష్టం చేశారు. అయితే అవి హింసాత్మకంగా మారకుండా, ప్రజలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకుండా ఉండాలని పేర్కొన్నారు. గత డీఎంకే ప్రభుత్వంలో రైతులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం విజయ్‌ ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్లు ధర్నాలు చేపడితే కేసులు పెట్టారని.. అది అమానవీయమని మండిపడ్డారాయన. ఆయా కేసులు ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని సభలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో 2021 మే నుంచి 2026 వరకు ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నీ రద్దు కానున్నాయి. రాష్ట్రానికి దేశానికి రైతులే వెన్నెముక అని విజయ్‌ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా సిప్‌కాట్‌ పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సందర్భంగా రైతులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. విజయ్‌ ప్రకటన చేసిన సమయంలో ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌ సభలోనే ఉండడం గమనార్హం. డీఎంకే హయాంలో పరందూర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామస్తులు సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఈ తరుణంలో.. విమానాశ్రయాన్ని రద్దు చేస్తూ విజయ్‌ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసినప్పటికీ వారిపైనా కేసులు పెట్టారని సీఎం విజయ్‌ తెలిపారు. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును వినియోగించుకున్నందుకు కేసులతో వేధించడం సరికాదని వ్యాఖ్యానించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ