హైదరాబాద్‌లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆర్టీసీ సర్వీసులు

الأربعاء، 2 سبتمبر 2026

and thousands of other night-duty workers IT professionals working night shifts private sector employees RTC Services in Hyderabad from 11 PM to 5 AM Telangana State Road Transport Corporation

t f B! P L

హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నైట్ డ్యూటీలు చేసే ప్రైవేట్ ఎంప్లాయిస్, ఐటీ కంపెనీల్లో నైట్ షిఫ్ట్‌లకు వెళ్లే టెక్కీలు, సివిల్ వర్క్స్‌ చేసుకునే వేలాది మంది ఇకపై ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టుతో కష్టాలు,డబ్బులు ఖర్చు చేసుకునే బాధను తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ తగ్గించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నగరంలోని ప్రధానంగా 6 రూట్లలో ఈ సౌకర్యాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం రాత్రి నుంచి ఈ సర్వీసులను కొనసాగిస్తోంది. మొత్తం 15 బస్సులతో ఈ సేవలను ప్రారంభించినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.శ్రీధర్ తెలిపారు. నగరంలోని ప్రధాన మార్గాలను, ఎక్కువ మంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే రూట్లను కలుపుతూ ఈ నైట్ సర్వీసులను నడుపుతున్నారు. 1. కోఠి నుంచి పటాన్‌చెరు ,అబిడ్స్, లక్డీకాపూల్, కొండాపూర్ వరకు రూట్ నంబర్ 222A పేరుతో ప్రతి 45 నిమిషాలకు ఒక ట్రిప్ నడుపుతుంది. ఇక 2. రూట్ అఫ్జల్‌గంజ్ నుంచి CBS, పటాన్‌చెరు, కోఠి, KPHB, మియాపూర్ మీదుగా 218 నంబర్‌తో బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇక 3. సికింద్రాబాద్ నుంచి పటాన్‌చెరు , ప్యారడైజ్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మీదుగా 219 నంబర్‌తో మరో సర్వీసు నైట్ టైమ్‌లో బస్సు సౌకర్యం ఉంది. 4. హైదరాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న హయత్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు ఎల్‌బీ నగర్, నాగోల్, తార్నాక కలుపుకుంటూ 290U సర్వీసు ఏర్పాటు చేసింది. దీంతో పాటు బాచుపల్లి నుంచి వేవ్‌రాక్ ,ఐటీ క్యాంపస్‌ల మీదుగా 195W నంబర్ తో ఓ సర్వీసు అందుబాటులో ఉంది. కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు 10H నంబర్ సర్వీసు నడుస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ