కేదార్‌నాథ్ మార్గంలో విరిగిపడిన కొండచర్యలు : చిక్కుకున్న 45 మంది తూర్పుగోదావరి జిల్లా యాత్రికులు
الاثنين، 28 سبتمبر 2026
1 45 Pilgrims from East Godavari District Stranded 500 pilgrims were stranded Andhra Pradesh Char Dham Yatra has been halted Landslide on Kedarnath Route national
ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్ర నిలిచిపోయింది. కేదార్‌నాథ్ యాత్రా మార్గంలో కొండచర్యలు విరిగిపడటంతో సుమారు 1500 మంది యాత్రికులు చిక్కుకున్నారు. సోన్‌ప్రయాగ్ సమీపంలోని చిర్బాసా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన 45 మంది యాత్రికులు అక్కడే ఉన్నారు. దర్శనాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ సంఘటన ఎదురైంది. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా యాత్రికుడు పీవీ కృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, డీడీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ ఆశిష్ డిప్రి నేతృత్వంలో సహాయక చర్యలు జోరుగా సాగాయి. భారీ మట్టి, రాళ్లు తొలగించి మార్గం సుగమం చేశారు. ప్రమాదకర ప్రాంతం దాటేలా సిబ్బంది తగిన మార్గదర్శనం అందించారు. యాత్రికులను సురక్షితంగా గౌరీకుండ్‌కు తరలించారు.
ليست هناك تعليقات:
إرسال تعليق