ఆసియా క్రీడలు : మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఈషా సింగ్‌కు రజత పతకం : సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

الاثنين، 28 سبتمبر 2026

Asian Games CM Revanth Reddy congratulates her Esha Singh wins silver in women's 25m pistol individual event national sports

t f B! P L

జపాన్‌లో జరుగుతోన్న 2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్ ఈషా సింగ్ రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆసియా క్రీడల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ షూటర్, హైదరాబాద్ నగరానికి చెందిన ఈషా సింగ్ వెండి పతకం సాధించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఐదుసార్లు షూటాఫ్‌లలో ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కొని, స్వల్ప తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయినా ఆమె ప్రదర్శన అద్భుతమని ప్రశంసించారు. ఈషా సింగ్ పోరాట స్ఫూర్తి క్రీడాలోకానికి ఆదర్శమని పేర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికలపై మరెన్నో గొప్ప విజయాలు అందుకొని దేశ ప్రతిష్ఠను, తెలంగాణ కీర్తిని చాటాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోరులో టై బ్రేకర్‌లో చైనా షూటర్ జియావో చేతిలో ఈషా సింగ్ ఓడిపోయింది. స్వర్ణం కోసం చివరి వరకు పోరాడిన ఈషా టై బ్రేకర్‌లో మాత్రం 2-3 తేడాతో పరాజయం పాలై రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో మొత్తం ఆరు షూటాఫ్‌లను ఈషా సింగ్ ఎదుర్కొంది. ఇందులో నాలుగు సిల్వర్‌, బ్రాంజ్‌ కోసం జరిగిన పోరు కాగా మరో రెండు షూటాఫ్‌లు స్వర్ణం కోసం జరిగాయి. అయితే ఒక్క షాట్ తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకున్న ఈషా సింగ్ వెండి పతకంతో సరిపెట్టుకుంది.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ