వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు : ఐదు చర్మాలు, 23 పులి గోర్ల స్వాధీనం
الأحد، 27 سبتمبر 2026
Andhra Pradesh Five Skins and 23 Tiger Claws Seized Proddatur area of Kadapa district special forest team from Mydukur conducted raids Wildlife Skin Smuggling Gang Busted
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతంలో వన్యప్రాణుల చర్మాల స్మగ్లింగ్ ముఠా గుట్టును అటవీశాఖ అధికారులు రట్టు చేశారు. మైదుకూరులోని ఫారెస్ట్ స్పెషల్ టీమ్ దాడులు నిర్వహించి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరొక నిందితుడు పరారయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడుల్లో నిందితుల వద్ద నుంచి మొత్తం ఐదు చర్మాలు, 23 పులి గోర్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్వాధీనం చేసుకున్న వాటిని పరిశీలించగా అందులో ఒక దుప్పి చర్మం ఒరిజినల్ కాగా, మిగిలిన పులి చర్మాలు డూప్లికేట్ అని అధికారులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి కడప పట్టణంతో బలమైన లింకులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ఫారెస్ట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి టి. రాజశేఖర్ బాబు, ప్రొద్దుటూరు సబ్ డీఎఫ్ఓ సంకేత్ సునీల్ గరుడ్, ఎఫ్ఆర్ఓ హేమాంజలి మరియు నయంఅలి తదితరులు పాల్గొన్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق