గణేశ్ నిమజ్జనం అనంతరం ముంబైలోని జుహూ బీచ్ వద్ద ప్రత్యేక శుభ్రతా కార్యక్రమం చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత, కుమార్తె దివిజ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సీ షోర్ షైన్ 2026' కార్యక్రమంలో భాగంగా శనివారం జుహూ తీరంలో భారీగా క్లీన్ అప్ కార్యక్రమం చేపట్టారు. అనంత చతుర్దశి సందర్భంగా శుక్రవారం ముంబైలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరిగింది. మరుసటి రోజే జుహూ బీచ్‌లో సముద్ర తీరాన్ని శుభ్రం చేసేందుకు 'సీ షోర్ షైన్ 2026' కార్యక్రమాన్ని నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం భార్య అమృత, దివిజ స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తీరంలో ఉన్న వ్యర్థాలను తొలగించారు. దివ్యాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సీ షోర్ షైన్' కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం. గతంలోనూ ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. 2024లో వెర్సోవా బీచ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి 3,000 మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తలు హాజరైనట్లు దివ్యాజ్ ఫౌండేషన్ తెలిపింది.
ホーム
/
maharashtra
/
దివ్యాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సీ షోర్ షైన్ 2026' కార్యక్రమం : పాల్గొన్న ఫడణవీస్ భార్య అమృత, కుమార్తె దివిజ
السبت، 26 سبتمبر 2026
'Sea Shore Shine 2026' event organized by Divyaj Foundation Fadnavis's wife Amruta and daughter Divija participate Garbage cleanup at Mumbai beach maharashtra
ليست هناك تعليقات:
إرسال تعليق