టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోయాననే మనస్తాపంతో నవవధువు ఆత్మహత్య

الجمعة، 21 أغسطس 2026

Andhra Pradesh Dattirajeru Mandal hinarajeru village Newlywed Dies by Suicide After Failing to Secure Desired Marks in Teacher Eligibility Test Vizianagaram district

t f B! P L

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలో ఆశించిన స్థాయిలో మార్కులు సాధించలేకపోయాననే తీవ్ర మనస్తాపంతో ఓ నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లయిన కేవలం 50 రోజులకే ఈ ఘోరం జరగడంతో ఇరు కుటుంబాలతో పాటు స్థానికంగా తీవ్ర శోకసంద్రం అలుముకుంది. విజయనగరం పట్టణంలోని అయ్యన్నపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ విసినిగిరి చంద్రశేఖర్ కుమార్తె తనూజకు, సమీప బంధువు ప్రసన్నకుమార్‌తో ఈ ఏడాది జూలై 2న వివాహమైంది. వివాహం తర్వాత కొన్నిరోజులు విజయనగరంలో ఉన్న తనూజ, ఆషాఢ మాసం ముగియడంతో ఈ నెల 19న అత్తవారి గడప తొక్కింది. అయితే ఇటీవల విడుదలైన టెట్ రెస్పాన్స్ షీట్‌లో తక్కువ మార్కులు రావడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మేడపై గదిలోకి వెళ్లిన తనూజ ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తెకు ఇతర ఎలాంటి సమస్యలు లేవని, టెట్‌లో తక్కువ మార్కులు రావడం వల్లే మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తండ్రి ఫిర్యాదు చేశారు. పెదమానాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ