బ్రిటీష్ సైన్యానికి చెందిన అతిపెద్ద శిక్షణా కాలేజీల్లో ఒకటైన 'ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్' తీవ్ర వివాదంలో చిక్కుకుంది. అక్కడ మహిళా సైనికులపై వ్యవస్థాగతంగా లైంగిక వేధింపులు, సామూహిక అత్యాచారాలు, పురుషాధిక్య వేధింపుల గురించి పలువురు బహిరంగంగా ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నార్త్ యార్క్‌షైర్‌లోని హారోగేట్‌లో ఉన్న ఈ అకాడమీలో గత ఐదేళ్లలో తాము ఎదుర్కొన్న భయానక అనుభవాలను కనీసం నలుగురు బాధితులు పంచుకున్నారు. వేధింపులతో సైన్యం నుంచి వైదొలిగిన మహిళలు.. కాలేజీలో సిబ్బంది ప్రోత్సాహంతో స్త్రీ ద్వేషం, లైంగిక హింస వంటి ప్రమాదకరమైన సంస్కృతి నెలకుందని ఆరోపించారు. అండర్-19 విభాగంలో యూకేలోనే అతిపెద్ద సైనిక శిక్షణా కేంద్రమైన ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్‌లో 16 ఏళ్ల వయస్సులో ఉండేవారే ఇక్కడ శిక్షణ పొందుతారు. ప్రస్తుతం 889 మందిలో కనీసం 70 మంది మహిళలు ఉన్నారు. ఈ ఆరోపణలు బ్రిటిష్ సైన్యంలో మహిళల భద్రతపై ఉన్న ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. దీనిపై మొట్టమొదటిసారి జరిగి అధికారిక సర్వే ప్రకారం.. బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న మహిళల్లో 67 శాతం మంది గతేడాది తమ పురుష సహోద్యోగి నుంచి కనీసం ఒక్కసారైనా వారి అంగీకారం లేని లైంగిక ప్రవర్తనకు గురయ్యారని తేలింది. యూకే రక్షణ శాఖ నివేదిక ప్రకారం జనవరి 2018 నుంచి జూన్ 2025 మధ్య ఈ కాలేజీలో అనుచిత లైంగిక ప్రవర్తనపై దాదాపు 176 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో 32 శాశ్వత సిబ్బందిపై కాగా, 144 జూనియర్ సైనికులపై వచ్చాయి. అయితే, సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థనలో ఈ నివేదికలు ఎవరిపైనా విచారణకు లేదా శిక్షలకు దారితీశాయా లేదా అనేది వెల్లడి కాలేదు.
ホーム
/
international
/
తీవ్ర వివాదంలో చిక్కుకున్న బ్రిటీష్ ఆర్మీ ఫౌండేషన్ కాలేజ్ : మహిళా సైనికులపై సామూహిక అత్యాచారాలు, లైంగిక హింస
الخميس، 6 أغسطس 2026
Allegations of Gang Rape and Sexual Violence Against Female Soldiers British Army Foundation College Embroiled in Major Controversy international
ليست هناك تعليقات:
إرسال تعليق