ఆంధ్రప్రదేశ్ రాస్ట్రం విశాఖపట్నంలో ఇంటి అద్దె బకాయి ఇవ్వమని అడిగినందుకు యజమానిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సబ్బవరపు దుర్గాప్రసాద్ (79) అనే వృద్ధుడు విశాఖలోని అంబేడ్కర్ నగర్‌లో నివసిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు విదేశాల్లో ఉండడంతో రిటైర్మెంట్ తరువాత ఇంటి దగ్గరనే కాలం వెళ్లదీస్తున్నాడు. కొన్ని నెలల క్రితం భోగాపురానికి చెందిన భరత్ కుమార్ అనే ఇంజినీర్ దుర్గాప్రసాద్ ఇంట్లో అద్దెకు దిగాడు. భరత్ తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఏడు నెలల క్రితం భరత్ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఫర్నిచర్ దెబ్బతినడం, అద్దెబకాయిలు చెల్లించాల్సి ఉండడంతో భరత్‌కు దుర్గప్రసాద్ చేసి అడిగాడు. మాటమాట పెరిగి ఇద్దరు మధ్య గొడవ జరిగింది. భరత్ ఆవేశంలో దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్లి ఆయనతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో బలమైన వస్తువుతో వృద్ధుడి ముఖంపై కొట్టి పారిపోయాడు. దుర్గాప్రసాద్ సోదరి ఇంటికి వచ్చి చూడగా అతడు స్పృహలో లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ホーム
/
Visakhapatnam
/
యజమాని ప్రాణం తీసిన అద్దె బకాయి
الجمعة، 21 أغسطس 2026
Andhra Pradesh argument ensued between the two crime police have registered a case and are investigating the incident Unpaid Rent Costs Landlord His Life Visakhapatnam
ليست هناك تعليقات:
إرسال تعليق