స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఏపీ కేబినెట్ ఆమోదం

الثلاثاء، 18 أغسطس 2026

AP Cabinet Approves 34% Reservation for BCs in Local Body Elections local bodies to ensure the timely receipt of funds due from the Central Governmen

t f B! P L

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం స్థానిక సంస్థలకు సంబంధించిన నిబంధనలు, రిజర్వేషన్లు, పరిపాలనా సంస్కరణలు సహా 55కి పైగా అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులను సకాలంలో పొందేందుకు వీలుగా, గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం అత్యవసరమని కేబినెట్ భావించింది. ఈ సందర్భంగా చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారమే బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు జరపాలని స్పష్టం చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా, గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవని, ప్రస్తుతం అమల్లో ఉన్న విధానమే యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించింది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు మంత్రివర్గానికి వివరించారు. ఎన్నికల నిర్వహణ పద్ధతిలోనూ కేబినెట్ ముఖ్యమైన మార్పులు ప్రతిపాదించింది. ఇకపై నగర, పట్టణ, నగర పంచాయితీల్లో మేయర్లు, చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతి ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. పాలనా సంస్కరణల్లో భాగంగా, ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను కొత్త జిల్లాల విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్ లుగా విస్తరించేందుకు కేబినెట్ ఆమోదించింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ