గ్రీన్ కమర్షియల్ వెహికల్స్ పర్మిట్ వయోపరిమితి మరో ఐదేళ్లు పెంపు

الثلاثاء، 18 أغسطس 2026

Age Limit for Green Commercial Vehicle Permits Extended by Five Years automobile business national Union Ministry of Road Transport and Highways

t f B! P L

దేశంలో పర్యావరణహిత కమర్షియల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు, రవాణా రంగానికి వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని తీసుకుంది. 1989 నాటి కేంద్ర మోటారు వాహన నిబంధనల (సీఎంవీఆర్) సవరణ ముసాయిదాలోని రూల్ 88 ప్రకారం బ్యాటరీ, హైడ్రోజన్, సహజ వాయువు (సీఎన్‌జీ/ఎల్ఎన్‌జీ)లతో నడిచే వాణిజ్య వాహనాల నేషనల్ పర్మిట్ వయోపరిమితిని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని కేంద్రం ప్రతిపాదించింది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న 12 ఏళ్లు, 15 ఏళ్ల వయోపరిమితి వరుసగా 17, 20 ఏళ్లకు పెరుగుతాయి. నీతి ఆయోగ్ 2025 నివేదిక ప్రకారం అధిక ధరల వల్ల ఎలక్ట్రిక్ ట్రక్కుల అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నందున, ఈ ఐదేళ్ల అదనపు పరిమితి ఆపరేటర్లు తమ భారీ పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి, లాభసాటిగా బిజినెస్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. పర్మిట్ ప్రాసెసింగ్‌లో పారదర్శకత కోసం జాతీయ పర్మిట్ విధానాలను పూర్తిగా ఆన్‌లైన్ మయం చేస్తున్నారు. ఆపరేటర్లు ఇకపై ప్రతి సంవత్సరం ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒకేసారి ఐదేళ్ల కాలానికి రూ. 82,500 చెల్లించి పర్మిట్ పొందే సౌలభ్యం రానుంది. అలాగే 'వాహన్' డేటాబేస్‌ను అనుసంధానించడం ద్వారా ఫారాల్లో వివరాలు ఆటోమేటిక్‌గా ఫిల్ అవుతాయి. అయితే పారదర్శకత కోసం వాహన యజమానుల మొబైల్ నంబర్‌కు ఆధార్ లింక్ చేయడం, ఫారం 48లో వాహనం చెల్లుబాటు అయ్యే ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పీయూసీ, ఫిట్‌నెస్‌తో పాటు పెండింగ్ చలాన్ల హిస్టరీని ఎంటర్ చేయడం తప్పనిసరి చేశారు బాడీ లేని ఛాసిస్‌ల తాత్కాలిక రిజిస్ట్రేషన్ చెల్లుబాటును 6 నెలలకు పెంచగా, వర్క్‌షాప్‌లలో జాప్యం జరిగితే ప్రతిసారీ 30 రోజుల చొప్పున పొడిగించే వెసులుబాటు కల్పించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయ్యేలా రీ-డిజైన్ చేసే వాహనాలకు 45 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. దీంతో పాటు కేంద్ర సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం ఆమోదం పొందిన ఆటోమొబైల్ విడిభాగాల ఆర్‌అండ్‌డీ (ఆర్అండ్‌డీ) తయారీదారులను కూడా 'ట్రేడ్ సర్టిఫికేట్' పరిధిలోకి తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదిత నిబంధనలపై 30 రోజుల పాటు ప్రజలు, రవాణాదారుల నుండి అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ