షరతులు నెరవేరిన తర్వాతే జలసంధిని పూర్తిగా తెరుస్తాం : ఇరాన్ పార్లమెంట్ స్పీకర్

الثلاثاء، 18 أغسطس 2026

international Iran's Parliament Speaker ohammad Bagher Ghalibaf Strait will be fully opened only after conditions are met

t f B! P L

హార్ముజ్ జలసంధిని ఇప్పట్లో తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తమపై విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు చమురు ఆంక్షలను తొలగించాలని, విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ షరతులు నెరవేరిన తర్వాతే జలసంధిని పూర్తిగా తెరుస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, ఆ దేశ ప్రధాన చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. మంగళవారం ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రసంగంలో గాలిబాఫ్ మాట్లాడుతూ అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో పేర్కొన్న హామీలను అమెరికా అమలు చేసే వరకు హార్ముజ్ జలసంధిని తెరవబోమని స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా మూడు కీలక చర్యలు తీసుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లు గతంలో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన జూన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించినవని గాలిబాఫ్ తెలిపారు. అయితే ఆ ఒప్పందం అనంతరం పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగుతోంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు ఇరాన్ నుంచి అనుమతి తీసుకోవడంతో పాటు ట్రాన్సిట్ సర్వీస్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని సమాచారం. అయితే అమెరికా, పలు ప్రాంతీయ దేశాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన భాగం ఈ మార్గం మీదుగానే రవాణా అవుతుంది. దీంతో జలసంధిపై కొనసాగుతున్న ప్రతిష్టంభన అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు సంబంధించి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఈ జలసంధికి సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. గత కొన్ని వారాలుగా నౌకల రాకపోకలకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసే అంశంపై చర్చలు జరుపుతున్నాయి. ప్రతిపాదిత నౌకా రవాణా మార్గానికి సంబంధించిన భౌగోళిక కోఆర్డినేట్లపై ఇప్పటికే ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరిందని ఇరాన్ తెలిపింది. సంయుక్త ప్రకటనకు సంబంధించిన అంశాలపై కూడా ఇరుదేశాలు అభిప్రాయాలను పంచుకుంటున్నట్లు వెల్లడించింది. హార్ముజ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇరాన్‌తో హార్ముజ్ అంశంపై అమెరికా కుదుర్చుకునే ఒప్పందానికి ఒమన్ అడ్డుపడితే ఆ దేశంపై బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ కూడా తమకు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌తో ఒమన్ నౌకా రవాణాపై దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ