రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా జుర్హరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోసింగ గ్రామంలో జరిగిన పెళ్లి ఊరేగింపులో, కారు పైకప్పుపై బాణసంచా కాల్చడంతో కారుకు నిప్పంటుకుని పూర్తిగా కాలి బూడిదైంది. హర్యానా నుంచి పెళ్లి బృందం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి సంబరాల్లో భాగంగా, ఊరేగింపులో వచ్చిన కొందరు కారు పైకప్పు పైకి ఎక్కి నిలబడి బాణసంచా కాల్చారు. ఆ సమయంలో ఊహించని విధంగా టపాసుల నిప్పురవ్వలు కారు లోపలి భాగంలో పడ్డాయి. నిప్పురవ్వలు పడిన కొద్ది సెకన్లలోనే మంటలు కారు అంతటా వేగంగా వ్యాపించి, క్షణాల్లో వాహనం పూర్తిగా అగ్నిగోళంగా మారిపోయింది. కనురెప్పపాటు కాలంలో కారు భగ్గుమనడంతో, ఊరేగింపులో పాల్గొన్న జనం భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.
పెళ్లి ఊరేగింపులో బాణసంచా కాల్చడంతో నిప్పు అంటుకుని కాలి బూడిదైన కారు
الثلاثاء، 18 أغسطس 2026
Car Reduced to Ashes After Catching Fire During Wedding Procession Fireworks Ghosing village Jurhara police station in Deeg district Rajasthan wedding party was arriving from Haryana
ليست هناك تعليقات:
إرسال تعليق