యశోద హాస్పిటల్స్‌కు అంతర్జాతీయ ప్లాటినం గుర్తింపు

السبت، 18 يوليو 2026

Andhra Pradesh first and only hospital in the country from the Extracorporeal Life Support Organization International Platinum Recognition for Yashoda Hospitals telangana

t f B! P L

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) అత్యవసర వైద్య సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచ స్థాయి అవయవ మార్పిడి, అధునాతన ఎయిర్ అంబులెన్స్ సేవలతో పాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అందించే ఎక్స్‌ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ (ఎక్మో) విభాగంలో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకుని వైద్యం అందిస్తున్నందుకు గాను ఎక్స్‌ట్రాకార్పోరియల్ లైఫ్ సపోర్ట్ ఆర్గనైజేషన్  నుంచి అత్యున్నత స్థాయి ప్లాటినం అవార్డును దక్కించుకుంది. ఈ గుర్తింపు పొందిన దేశంలోని మొట్టమొదటి, ఏకైక ఆసుపత్రిగా యశోద హాస్పిటల్స్ చరిత్ర సృష్టించిందని సీనియర్ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ వి. రవిశంకర్ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రోగుల భద్రత, నాణ్యమైన వైద్యం, అత్యుత్తమ అంతర్జాతీయ నిబంధనలు పాటించడం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ఎముక మజ్జ మార్పిడి వంటి సంక్లిష్ట చికిత్సలను అత్యంత నైపుణ్యం కలిగిన నిష్ణాతులైన వైద్య బృందం ఇక్కడ నిరంతరం అందిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎక్మో సదుపాయం ఉన్న ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ద్వారా దేశవిదేశాల నుంచి రోగులను వేగంగా, సురక్షితంగా తరలించే వ్యవస్థను సైతం ఆసుపత్రి విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ సంస్థలలో శిక్షణ పొందిన వైద్యుల పర్యవేక్షణలో భారతీయ క్రిటికల్ కేర్ రంగాన్ని యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో యశోద హైటెక్ సిటీ మార్కెటింగ్ టీం లీడర్ చంద్రశేఖర్, మార్కెటింగ్ ప్రతినిధులు ఎస్.వి.వి. రామకృష్ణ, వి. సాయికిరణ్ పాల్గొన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ