కాలక్షేపం కోసం ఆడితే రూ. 1.4 కోట్లు గెలుచుకున్న మహిళ

السبت، 18 يوليو 2026

massive prize to Sue Rowley in North Carolina Tumbling Treasures USA Woman Wins ₹1.4 Crore After Playing for Pastime

t f B! P L

కాలక్షేపం కోసం ఆడిన ఆన్‌లైన్‌ లాటరీ గేమ్ అమెరికాలోని నార్త్‌ కరోలినాలో సూ రౌలీకి భారీ బహుమతిని అందించింది. మోరెస్విల్లే నివాసి అయిన సూ రౌలీ జూలై 8 రాత్రి నిద్ర రాకపోవడంతో సమయం గడపడానికి స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ లాటరీ గేమ్ ఆడటం ప్రారంభించింది. అలా కొత్తగా వచ్చిన 'టంబ్లింగ్ ట్రెజర్స్' అనే గేమ్‌లో రౌలీ 30 డాలర్లు పెట్టి ఆడింది. కానీ ఆమెకు అనుకోని అదృష్టం కలిసి వస్తుందని అస్సలు ఊహించలేదు. లాటరీ అధికారుల ప్రకారం, ఈ గేమ్‌లో ఇంత పెద్ద బహుమతి గెలుచుకునే అవకాశం 20 లక్షలమందిలో ఒకరికి మాత్రమే ఉంటుందట!. తెరపై అంత పెద్ద మొత్తాన్ని చూసినప్పుడు మొదట నమ్మలేకపోయానని రౌలీ చెప్పింది. అర్థరాత్రి నిద్ర రాక, ఊరికే అలా ఫోన్‌తో ఆడుకుంటూ ఉండగా వరించిన అదృష్టమని తెలిపింది. రూ. 1.4 కోట్లు రావడం  ముందు అస్సలు నమ్మలేకపోయాను అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. సోమవారం రాలీలోని లాటరీ ప్రధాన కార్యాలయంలో తన బహుమతి మొత్తాన్ని అందుకుంది. నిద్రలేమిని కాస్తా అదృష్టంగా మార్చుకున్న రౌలీ, ఈ డబ్బుతో తన ఇంటిని రిపేర్/రినోవేషన్ చేయించు కోవాలని ప్లాన్ చేస్తోంది.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ