ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో పేర్లతో ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను కావియర్ విడుదల చేసింది. కావియర్ నుండి కొత్తగా లెజెండ్స్ కలెక్షన్లో భాగంగా రెండు ప్రత్యేక ఫోన్లను రూపొందించింది. ఇందులో లియోనెల్ మెస్సీ పేరుతో శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా, క్రిస్టియానో రొనాల్డో పేరుతో ఐఫోన్ 17 ప్రోను కస్టమైజ్ చేసింది. ప్రతి ఫోన్ ఆయా ఫుట్‌బాల్ దిగ్గజాల వ్యక్తిత్వం, దేశభక్తిని ప్రతిబింబించేలా ప్రత్యేక డిజైన్‌తో రూపొందించారు. ఈ ప్రత్యేక ఎడిషన్ మొబైల్స్ లో 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, క్లోయిజోనే ఎనామెల్ ఆర్ట్‌వర్క్‌ను ఉపయోగించారు. చేతితో తయారు చేసిన ప్రత్యేక డిజైన్ కారణంగా ఇవి కలెక్టర్ ఎడిషన్‌గా నిల్వునుందని కంపెనీ తెలిపింది. ప్రతి ఫోన్‌కు ప్రత్యేక సీరియల్ నంబర్‌తో పాటు ధృవీకరణ పత్రం కూడా అందజేస్తారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ సిరీస్‌లో మెస్సీ మోడల్ 19 యూనిట్లు, రొనాల్డో మోడల్ 19 యూనిట్లు మాత్రమే తయారు చేయనున్నారు. ప్రతి ఫోన్ ప్రీమియం బాక్స్‌లో గోల్డ్ ప్లేటెడ్ కీతో అందించబడుతుంది. అంతేకాకుండా.. కొనుగోలుదారులు కోరుకుంటే ప్రత్యేక వ్యక్తిగత కస్టమైజేషన్ సదుపాయాన్ని కూడా కావియర్ అందిస్తోంది. ఈ లగ్జరీ ఫోన్ల ధరలు తారా స్థాయిలో ఉన్నాయి. క్రిస్టియానో రొనాల్డో ఎడిషన్ ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర 11,410 డాలర్లు (రూ.9.8 లక్షలు) కాగా, లియోనెల్ మెస్సీ ఎడిషన్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా ప్రారంభ ధర 13,130 డాలర్లు (రూ.11.3 లక్షలు)గా ఉంది. స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ホーム
/
technology
/
ఫుట్‌బాల్ దిగ్గజాల పేరుతో ప్రత్యేక ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసిన కావియర్
السبت، 18 يوليو 2026
Caviar Launches Special Edition Smartphones Named After Football Legends cloisonné enamel artwork mobiles incorporate 24-karat gold plating technology
ليست هناك تعليقات:
إرسال تعليق