బాబా అవతారమెత్తిన రౌడీ షీటర్‌ : వలపన్ని పట్టుకున్న పోలీసులు

الثلاثاء، 14 يوليو 2026

arrested after police lay a trap hyderabad Mohammad Javed had murdered Rowdy-sheeter posing as a 'Baba' Task Force handed Mohammad Javed over to the Saifabad police telangana

t f B! P L

హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బాబా అవతారం ఎత్తిన రౌడీషీటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.మహ్మద్‌ జావేద్‌ అనే వ్యక్తి 2018లో సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని రౌడీషీటర్‌ హత్య చేశాడు. ఆపై పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు 2020 ఆగస్టులో జావేద్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. అప్పటి నుంచి జావేద్‌ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, పోలీసుల కళ్లుగప్పి సంగారెడ్డి జిల్లా చేర్యాలలో జావేద్‌ బాబా అవతారం ఎత్తాడు. ఓ దర్గాలో బాబాగా చలామణి అవుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఖైరతాబాద్‌ జోన్‌ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని చాకచక్యంగా జావేద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా గంజా సేవించినట్లు నిర్దారించారు. మరోవైపు రౌడీషీటర్‌ వద్ద భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అనంతరం మహ్మద్‌ జావేద్‌ను సైఫాబాద్‌ పోలీసులకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పగించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ