కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభ రెడ్డి చనిపోయారు. హైదరాబాద్ లో ని సింధు ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన మంగళవారం సాయంత్రం చనిపోయారు. ఆయనకు వయసుతో పాటు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన వైసీపీలో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో ఉండగా పరామర్శించేందుకు కూడా జగన్ రాలేదు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన ఆయన, తన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు వారసత్వంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1978లో జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పిలుపుతో టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ముద్రగడ, ఆ కాలంలోనే తన కంచుకోట అయిన ప్రత్తిపాడు నుంచి వరుస విజయాలు సాధించి కాపు సామాజికవర్గంలో తిరుగులేని మాస్ లీడర్‌గా ఎదిగారు.ముద్రగడ కేవలం ఎన్నికల రాజకీయాలకే పరిమితం కాకుండా, కాపు సామాజికవర్గ ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలు ఆయనను ఉద్యమ నేతగా మార్చాయి. ముఖ్యంగా 1990ల కాలంలోనూ, ఆ తర్వాత 2016లో తుని వేదికగా ఆయన నడిపించిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాపుల సంక్షేమమే ఎజెండాగా ఆయన సాగించిన ఆమరణ నిరాహార దీక్షలు, పాదయాత్రలు కోస్తా ఆంధ్రాలో పెద్ద సంచలనం సృష్టించాయి.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే, ఆ ఎన్నికల ప్రచార పర్వంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడిస్తానని, ఒకవేళ ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ బహిరంగంగా సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో, తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన పేరును ముద్రగడ పద్మనాభం నుండి ముద్రగడ పద్మనాభరెడ్డి గా మార్చుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదట్లో ఆయన రాజకీయంగా పవర్ ఫుల్ గా ఉన్నా రాను రాను స్వార్థపూరిత రాజకీయాలు, కులాన్ని అడ్డు పెట్టుకుని పదవులకోసం ప్రయత్నించడంతో ఆయన హవా తగ్గిపోయింది.
ముద్రగడ కన్నుమూత
الثلاثاء، 14 يوليو 2026
Andhra Pradesh Mudragada Passes Away undergoing treatment for severe health issues at Sindhu Hospital in Hyderabad
ليست هناك تعليقات:
إرسال تعليق