హార్ముజ్ జలసంధి లో యూఏఈ చమురు నౌకలపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు మరణించిన ఘటనపై న్యూఢిల్లీ తీవ్రంగా స్పందించింది. ఈ దారుణ ఘటనపై నిరసన తెలియజేస్తూ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత్‌లోని ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌కు అత్యవసర సమన్లు జారీ చేసింది. ఇరాన్ రాయబారి ప్రస్తుతం న్యూఢిల్లీలో అందుబాటులో లేకపోవడంతో, ఆయన స్థానంలో ఉన్న డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి భారత్ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఒమన్ ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తోన్న యూఏఈకి చెందిన 'మొంబాసా', 'అల్ బహియా' నౌకలపై ఇరాన్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రేనియన్లతో కలిపి మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌కు అత్యవసర సమన్లు జారీ చేసిన భారత్
الثلاثاء، 14 يوليو 2026
incident in which an Indian sailor was killed India Summons Iran's Deputy Ambassador Urgently national UAE-owned vessels 'Mombasa' and 'Al Bahiyah'
ليست هناك تعليقات:
إرسال تعليق