హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని బోడుప్పల్‌లో భూ పోరాటం చేస్తున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. తోపులాట చోటు చేసుకువడంతో కవితతో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉప్పల్‌లో ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని కవిత అన్నారు. బొల్లారం పీఎస్ వద్ద టీఆర్‌ఎస్ చీఫ్ మాట్లాడుతూ.. మహిళలు, తెలంగాణ ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను మాత్రమే అడిగాం తప్ప వేరే డిమాండ్లు ఏమీ అడగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి నుంచి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. ఉద్యమకారులకు వాళ్లు ఇస్తామన్న 250 గజాల స్థలం ఇవ్వాలని మాత్రమే అడిగామని తెలిపారు. కచ్చితంగా ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అడిగితే ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టటం అన్యాయమన్నారు. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను ఈ ప్రభుత్వానికి రోజూ గుర్తు చేస్తూనే ఉంటామని కవిత స్పష్టం చేశారు.
బోడుప్పల్‌లో కవితను అరెస్ట్ చేసిన పోలీసులు
الخميس، 2 يوليو 2026
hyderabad leading a land-related protest Police Arrest Kavitha in Boduppal shifted them to the Bollarum police station telangana
ليست هناك تعليقات:
إرسال تعليق